ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 11 2025 1:38 AM | Updated on Apr 11 2025 1:38 AM

ఇంజిన

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సందీప్‌ లెంక అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కేంద్రపడ జిల్లాలోని రాజ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వాడు. సమాచారం తెలుసుకున్న గుణుపూర్‌ ఆదర్శ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల న్యూటన్‌ విభాగం హాస్టల్‌లో 24 వ నంబరు గదిలో సందీప్‌ ఉండేవాడు. బుధవారం కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల వీడ్కోలు సభ జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా సందీప్‌ హాజరు కాలేదు. సందీప్‌ ఉంటున్న గదిని శుభ్రం చేసేందుకు ఓ మహిళ వెళ్లి తలుపు కొట్టగా ఏమీ సమాధానం రాలేదు. దీంతో ఆమె వెంటనే వార్డెన్‌కు విషయం తెలియజేశారు. అనంతరం హాస్టల్‌ వార్డెన్‌, యాజమాన్య సిబ్బంది వెళ్లి గది తలుపులను విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ సందీప్‌ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి

జయపురం: ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, పట్టణానికి వచ్చే గ్రామీణులు, స్థానికులు ఎండలో సేద తీరేందుకు జయపురం పట్టణ ప్రధాన సెంటర్లలో తాత్కాలిక రెస్ట్‌ షెడ్లు ఏర్పాటు చేయాలని ప్రముఖ సమాజ సేవకుడు బి.హరి రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జయపురం సబ్‌కలెక్టర్‌ అక్కవరం శొశ్యారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన ట్రాఫిక్‌ జంక్షన్‌లలో డిజిటల్‌ సిగ్నల్‌ లైట్‌ ఉందని, వాహనాలు దాదాపు ఒక నిముషం వరకు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. అధికంగా ఎండలు ఉండటం వలన ప్రజలు వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. 2024లో మున్సిపాలిటీ అధికారులు ఆ ప్రాంతంలో రెస్ట్‌ షెడ్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో రమేష్‌ జెనా, కె.గురు పట్నాయక్‌, బలరాం నాయక్‌, కమల లోచన, తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మద్యం దుకాణం

పర్లాకిమిడి: జిల్లాలో మోహనా బ్లాక్‌ గోవిందపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద దేశీ, విదేశీ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామస్తులు గురువారం గజపతి కలెక్టర్‌ బిజయకుమార్‌ దాస్‌, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ను, సబ్‌ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలను అందజేశారు. నలుగురు సారా వ్యాపారులు ఏర్పాటు చేసిన నాటు సారా, విదేశీ మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు.

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య 1
1/2

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య 2
2/2

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement