అండర్–15 ఫుట్‌బాల్ పోటీలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో సీఎం ట్రోఫీ అండర్–15 ఫుట్ బాల్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్రలు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీలు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. మరో వైపు నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో సీఎం ట్రోఫీ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో 15 ఏళ్లలోపు బాలురు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో, జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎంపీ బలబద్ర మజ్జి, ఎంఎల్‌ఎలు గౌరీ శంకర్ మజ్జి(నబరంగ్‌పూర్), నర్సింగ్ బోత్ర(జొరిగాం) పాల్గొన్నారు.
హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు
ఉత్సాహం చూపిన క్రీడాకారులు
అండర్–15 ఫుట్‌బాల్ పోటీలు
అండర్–15 ఫుట్‌బాల్ పోటీలు


