పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఫిబ్రవరి 15 నుంచి ఐదేళ్ల పాటు అన్ని పంచాయతీలలో మౌలిక సౌకర్యాల కల్పన, ఇతర సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలవుతాయని కలెక్టర్ బిజయకుమార్ దాస్ అన్నారు. వికసిత్ గావ్.. వికసిత్ ఒడిషా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ఖుర్దాలో ప్రారంభించగా గజపతి జిల్లా గుసాని సమితి మిషన్ శక్తి కేఫ్ వద్ద కలెక్టర్, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహిలు పెద్ద తెరపై ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, డి.ఆర్.డి.ఎ.అధికారి గుణనిధి నాయక్, గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు, బి.డి.ఓ.గౌర చంద్ర పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.