భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యను హత్య చేసి.. | - | Sakshi
Sakshi News home page

భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యను హత్య చేసి..

Nov 6 2024 12:34 AM | Updated on Nov 6 2024 11:41 AM

-

కొరాపుట్‌: దోపిడీ దొంగలు అమానుషంగా ప్రవర్తించారు. భర్తను చెట్టుకు కట్టి భార్యని హత్య చేసి నగలు దోచుకుపోయారు. కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి కుమర్‌ గందన పంచాయతీ హరియా ముండ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. మహేంద్ర ఖొర, సావి ఖొర(24)లు భార్యాభర్తలు.

 సుభద్ర పథకం కోసం ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసేందుకు వీరిద్దరూ నందపూర్‌ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో వీరిపై దాడికి పాల్పడ్డారు. కింద పడిపోయిన వెంటనే మహేంద్రను నీలగిరి చెట్టుకు కట్టేశారు. సావిని హత్య చేసి ఆమె ధరించిన బంగారు నగలు దోచుకుని పారిపోయారు. దొంగల దెబ్బలకు సొమ్మసిల్లిపోయిన మహేంద్ర కొంతసేపటి తర్వాత తేరుకొని గట్టిగా అరుస్తూ విలపించారు. 

ఆ మార్గం గుండా వెళ్తున్న కొందరు వాహనచోదకులు ఈ రోదనలు విని మహేంద్ర కట్లు విప్పి విషయం తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో వెతకగా కొద్ది దూరంలో సావి మృతదేహం గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగలకోసం గాలింపు చేపట్టారు. కొరాపుట్‌ జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు మహేంద్రను వైద్యం కోసం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని సాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement