మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

మహిళల బాల్‌బ్యాడ్మింటన్‌లో ‘విజయ’ ప్రతిభ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణాన్ని ఉపసంహరించుకోండి ఘనంగా ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల వార్షికోత్సవం తెలంగాణ వైపు వెళ్లిన పెద్దపులి

విజయవాడరూరల్‌: కృష్ణా యూనివర్సిటీ అంతర కళాశాలల మహిళల బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ నున్న ఆధ్వర్యాన శనివారం నిర్వహించారు. పోటీల్లో వివిధ కళాశాలల మహిళా క్రీడాకారులు క్రీడా ప్రతిభను చాటారు. ఉత్కంఠగా సాగిన పోటీల్లో విజయ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని పద్మావతి మహిళా కళాశాల, మచిలీపట్నం, తృతీయ స్థానాన్ని డాక్టర్‌ ఎల్‌హెచ్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు గెలుపొందగా, చతుర్థ స్థానాన్ని ఎస్‌డీఎంఎస్‌ కళాశాల విజయవాడ గెలిచింది. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి.విజయ్‌కుమార్‌, కళాశాల సెక్రటరీ ఎన్‌.సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): హైదరా బాద్‌–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–65) కంచికచర్ల వద్ద నుంచి ఉన్న రహదారినే విస్తరించకుండా, నక్కలం పేట నుంచి ఇబ్రహీంపట్నం గాజులపేట వరకు కొత్తగా ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మించాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు ఆయా గ్రామాల రైతులు, రైతు సంఘాల నాయకులు ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియను ఆమె చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో జరిగే అనర్థాలను జేసీకి వివరించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో 10 గ్రామాలు మున్నేరు, వైరా, కట్లేరు, ఏనుగడ్డ వాగుల వరద ముంపు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజలను సంప్రదించకుండా నిర్మించవద్దు

ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడి యలమందరావు మాట్లాడుతూ రైతులు, గ్రామ ప్రజలను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తీసు కోకుండా రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. జేసీని కలిసిన వారిలో నక్కలంపేట, పరిటాల, దాములూరు, చిలుకూరు, గనిత్కూరు, కొటికలపూడి తదితర గ్రామాల రైతు నాయకులు ఎన్‌.ఎన్‌.ప్రసాద్‌, మాగంటి లక్ష్మి, చెరుకూరి రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

గన్నవరం: స్థానిక ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల 16వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన బ్రిక్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ జి.వి.పి.పి.ఎన్‌.రవికుమార్‌ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. పశువైద్య రంగంలో ఆధునిక మార్పులు, శాస్త్ర సంబంధ విషయాల్లో విదార్థులు నైపుణ్యం సాధించాలన్నారు. డాక్టర్‌ చిక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.రేవంత్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా పశువైద్య వృతి పరమైన విషయాల్లో పరిణితి సాధించాలన్నారు. అనంతరం విద్య, క్రీడలు, సాంస్కృతి రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఇన్‌చార్జ్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌కుమార్‌ అధ్యక్షతన విద్యార్థి సంబంధాల వ్యవహారాల అధికారి డాక్టర్‌ ఎస్‌.శ్రీధర్‌, వ్యాయామ అధ్యాపకురాలు డాక్టర్‌ బి.కృష్ణదీపిక, ప్రొఫెసర్లు డాక్టర్‌ టి.శ్రీనివాస్‌కుమార్‌, డాక్టర్‌ అనిల్‌, డాక్టర్‌ మస్తాన్‌బీ పాల్గొన్నారు.

గంపలగూడెం: ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి (ఎక్స్‌ఫ్లోరర్‌) చివరకు తెలంగాణ వైపు తరలింది. శనివారం కనుమూరు అడవుల నుంచి కొత్తపల్లి మీదుగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం అటవీ ప్రాంతానికి చేరినట్లు అధికారులు నిర్ధారించారు. కొత్తపల్లి గ్రామస్తులు సైతం పులి పాదముద్రల ఫొటోలు తీసినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement