రూ.7 కోట్ల స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

రూ.7 కోట్ల స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి

Nov 30 2026 12:05 AM | Updated on Nov 30 2026 12:05 AM

రూ.7 కోట్ల స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి

హైకోర్టు న్యాయవాది అన్వర్‌ షేక్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల స్కామ్‌పై నమోదైన కేసులను సీబీఐతో విచారించాలని హైకోర్టు న్యాయవాది అన్వర్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకనే సీబీఐ విచారణ కోరుతున్నామని స్పష్టంచేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో న్యాయవాది అన్వర్‌ షేక్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరుతో రూ.7 కోట్ల స్కామ్‌ అంశంలో ధరణి కృష్ణకు సంబంధించిన వ్యవహారంలో మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులతో పాటు, అక్రమ నిర్బంధం, కస్టోడియల్‌ టార్చర్‌ ఆరోపణలపై హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ వేశామన్నారు. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకే బాధితురాలు సీబీఐ విచారణ కోరుతున్నారని, ఈ కేసులో జనసేనకు సంబంధించిన వ్యక్తుల పేర్లను కూడా ప్రతివాదులుగా చేర్చామని పేర్కొన్నారు. కేసు విచారణ కోసం హైదరాబాద్‌ నుంచి వస్తున్న న్యాయవాది నాగూర్‌పై కీసర టోల్‌ గేటు వద్ద 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేయడం అన్యాయమన్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు విచారణకు రావా లని సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. తమ క్లర్క్‌ను కూడా రిమాండ్‌కు పంపారని పేర్కొన్నారు. మంగళగిరి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. ఈ ఘటనపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైకోర్టు న్యాయవాదుల సంఘం, ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశామని అన్వర్‌ షేక్‌ తెలిపారు. అవసరమైతే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో, ఢిల్లీ దాకా తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రూ.7 కోట్ల మోసం కేసులో డీజీపీ, హోం మినిస్టర్‌ ఎందుకు స్పందించడం లేదని న్యాయవాది అన్వర్‌ ప్రశ్నించారు. ధరణి కృష్ణ పెనమలూరు స్టేషన్‌లో కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తీసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement