లబ్బీపేట(విజయవాడతూర్పు): సంజీవని కార్యక్రమం ద్వారా అందించే వైద్య సేవలు వందశాతం ప్రజలకు చేరేలా కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న సంజీవని శిక్షణలో భాగంగా 5వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, డీఎంహెచ్‌ఓతో పాటు, ప్రోగ్రామ్ అధికారులకు సంజీవని ద్వారా అందించనున్న వివిధ వైద్య సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. కార్యక్రమంలో లెప్రసీ, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భానూనాయక్, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతీదేవి, ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఎంఓ డాక్టర్ రాజునాయక్, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబం ధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కృష్ణా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. దీనికి జిల్లావ్యాప్తంగా 1200 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెదపారుపూడి, పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడు, పామర్రు, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల పరిధిలోని మొత్తం 142 పంచాయతీలకు సంబంధించి 1,460 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్, తదనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీలు – 7, సీఐలు – 25 మంది, ఎస్‌ఐలు – 62 మంది, ఏఎస్‌ఐలు – 66 మంది, హెడ్ కానిస్టేబుళ్లు – 145, పోలీస్ కానిస్టేబుళ్లు – 450 మందిని నియమించామని పేర్కొన్నారు.


