రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ప్రసూతికి వచ్చిన వారికి ఎక్కువగా రక్తం అవసరం
థలసీమియా చిన్నారులకురక్త నిల్వలు కేటాయింపు
క్యాంపులు, స్వచ్ఛంద దాతలు, రీప్లేస్‌మెంట్ ద్వారా సేకరణ
సేకరించిన యూనిట్లు ఇలా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విజ్ఞాన రంగం ఎంతగా అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఒక వ్యక్తి సహృదయంతో ముందుకొచ్చి దానం చేస్తే కానీ రక్తం దొరకని పరిస్థితి. దీనిని దృష్టిలో ఉంచుకుని రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంది. ప్రస్తుతం రక్తదానం చేయాలంటే అభ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)లో రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉండటంతో చాలా మందికి సాధ్యం కావడం లేదు.
జీజీహెచ్‌లో 15 వేల యూనిట్లు అవసరం
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులు ఏటా పెరుగుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా రక్తం అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 15 వేల యూనిట్ల వరకూ రక్తం అవసరం. 90 శాతం వరకూ స్థానికంగా ఉన్న బ్లడ్ బ్యాంక్ నుంచి అందిస్తున్నారు. ఏదైనా అరుదైన గ్రూపు అవసరమైనప్పుడు రోగికి కావాల్సిన రక్తం అందుబాటులో లేనప్పుడు బయట బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. అత్యధికంగా రక్తం యూనిట్లు ప్రసూతి విభాగానికి కేటాయిస్తున్నారు. ప్రతి నెలా 300 నుంచి 350 యూనిట్లు వరకూ ఆ విభాగానికే ఇస్తున్నారు. ప్రసవం కోసం వచ్చే వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు అత్యంత తక్కువగా ఉంటుండటంతో ఎక్కువ యూనిట్లు అవసరం అవుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఆ తర్వాత జనరల్ సర్జరీ, మెడిసిన్, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు ప్రతి నెలా 100 యూనిట్లు వరకూ కేటాయిస్తున్నారు
థలసీమియా చిన్నారులకూ..
ప్రభుత్వాస్పత్రిలోని పిడియాట్రిక్ విభాగానికి వచ్చే థలసీమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో 2020లో 19 మంది, 2021లో 11 మంది, 2022లో 9 మంది, 2023లో 20 మంది, 2024లో 30 మంది, 2025లో 26 మంది, 2026లో 15 మంది థలసీమియా చిన్నారులు జీజీహెచ్‌లో రిజిస్టర్ అయ్యారు. వారికి అవసరమైన రక్తాన్ని ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకు నుంచి అందిస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో స్వచ్చంధ రక్తదాతలు, రీప్లేస్‌మెంట్, క్యాంపుల నిర్వహణ ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. అలా జీజీహెచ్‌లోని మదర్ బ్లడ్ బ్యాంకులో సేకరించిన రక్తాన్ని ఇక్కడ అవసరమైనన్ని యూనిట్‌లు వినియోగిస్తూ, అనుబంధంగా ఉన్న పాత ప్రభుత్వాస్పత్రి, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరంలలోని స్టోరేజ్ యూనిట్‌లు రక్తాన్ని అందిస్తున్నారు. ఐదేళ్లలో జీజీహెచ్ బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించిన యూనిట్లు ఇలా...


