గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పాండు రంగ ప్రసాద్ మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్, అసెస్‌మెంట్ బుక్స్ వంటి అశాసీ్త్రయ మైన విధానా లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించి బోధనకే పరిమితం చేయాలన్నారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్‌ను మినహాయించాలని సూచించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేములపల్లి రాధిక, సయ్యద్ ఖాసీం మాట్లా డుతూ.. ఉపాధ్యాయులపై ఆన్‌లైన్ పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నాలుగు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో పోస్టు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షలు పూర్ణ చంద్రరావు, అబ్దుల్ నయీం, అవని, శెట్టిపోగు రాము, కార్యదర్శులు రామారావు, బి.వసరాం, ఒ.లాలామద్, రమణ, ఖాజా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


