లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుణదలలోని ఆయన ఘాట్ వద్ద శుక్రవారం ఆయన తనయుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసేవారని, నెహ్రూ వారసుడిగా అవినాష్ రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలిచారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను నమ్మిన వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా నెహ్రూ చూసుకున్నారన్నారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రితో సాన్నిహిత్యంగా ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు కై లే అనిల్‌కుమార్, మొండితోక జగన్మోహనరావు, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా నాయకుడు నెహ్రూ: పేర్ని నాని
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణాలో ప్రజానాయకుడిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్నినాని అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)9వ వర్ధంతిని పురస్కరించుకుని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల అండగా నిలిచారని, విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒకపేజీని నెహ్రూ సృష్టించుకున్నారని కొనియాడారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
అలాగే మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్‌లో లంకా అబ్బినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,
లేళ్ల అప్పిరెడ్డి


