ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌తో అగ్ని ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌తో అగ్ని ప్రమాదాల నివారణ

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌తో అగ్ని ప్రమాదాల నివారణ

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అమరావతి రాజధాని ప్రాంతంలో హైరేంజ్‌ బిల్డింగ్స్‌ రానున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ రూపొందించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ వెంకటరమణ చెప్పారు. ఫైర్‌ అండ్‌ సెక్యూరిటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అమరావతి చాప్టర్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలోని హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు ఫైర్‌ అండ్‌ సెక్యూరిటీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాతో పాటుగా తమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో రీజనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో త్వరలో 23 ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అసోసియేషన్‌ అమరావతి అధ్యక్షుడిగా ఎన్నికై న వి.కాంతారావు, కార్యదర్శి వైవీ దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఎం.మోహనరావు, డైరెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ బి.ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ డైరెక్టర్‌ శివరామకృష్ణన్‌, అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు రాఖీ దీపక్‌తో పాటుగా సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement