హజ్‌ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు

Apr 18 2026 8:11 AM | Updated on Apr 18 2026 8:11 AM

గన్నవరం: హజ్‌ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. స్థానిక ఎస్‌ఎం కన్వెన్షన్‌ సెంటర్‌లో హాజ్‌ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హజ్‌ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయలను ఆయన పర్యవేక్షించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ అంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 335 మంది హజ్‌ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిలో తొలి విడతలో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హజ్‌ యాత్రు వెళ్తున్న వారిలో 50 శాతం మహిళలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఇక్కడికి చేరుకున్న సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక వసతి, భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్‌, హజ్‌ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ షేక్‌ హాసన్‌బాషా, కమిటీ సీఈఓ గౌస్‌ పీర్‌ తదితరులు పాల్గొన్నారు. హజ్‌ యాత్రికుల వసతి కల్పిస్తున్న ఎస్‌ఎం కన్వెన్షన్‌ సెంటర్‌ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement