పెనమలూరు: కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్నినానిని ఆ పార్టీ రజక సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మచిలీపట్నంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ రజక, బీసీ సంఘాల నేతలు పేర్ని నానిని కలిసి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి పూర్ణరజక, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ రజక విభాగం అధ్యక్షుడు లింగాల శోభన్‌బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఓలేటి అరవింద్, నాయకులు సత్తెనపల్లి శ్రీను, తాడేపల్లి సుబ్బారావు, పత్తికాయల శివ తదితరులు పాల్గొన్నారు.


