విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం వివరాలు కలెక్టర్‌.. స్వీయ గణన

న్యూస్‌రీల్‌

ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం.

చిలకలపూడి : జన గణన– 2027కు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ గురువారం ఆయన చాంబర్‌లో స్వీయ గణన చేసుకున్నారు.

ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మల్లయ్య. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు గ్రామం. వయసు 32 సంవత్సరాలు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లూ పడిపోయాయి. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ భారం అంతా అతని భార్యపై పడింది. పిల్లల చదువులు, భర్తకు మందులు, కుటుంబ పోషణ కష్టం మారింది. విధిలేని పరిస్థితుల్లో విజయవాడ వచ్చి భర్త ఆరోగ్యం చూసుకుంటూ వాచ్‌ఉమన్‌గా పనిచేస్తోంది. తన భర్తకు పెన్షన్‌ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.

‘ఈ ఫొటోలో వ్యక్తిపేరు చింతలపూడి దుర్గారావు. ఇతనికి సొంతిల్లు లేదు. విజయవాడ సత్యనారాయణపురంలో అద్దె ఇంట్లో నివసివస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని ఎడమ కాలిని మోకాలి వరకు తొలగించారు. రెండో కాలుకు పైలేరియా సోకడంతో నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. పొట్టకూటి కోసం బీసెంట్‌ రోడ్డులో ఓ పక్కన పట్టా వేసుకుని కూర్చుని జూట్‌ సంచులు, పట్టీలు, చైన్‌లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సదరం క్యాంప్‌లో వైద్యులు అతడిని పరీక్షించి 70 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్‌ జారీ చేశారు. పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుందామంటే రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో సైట్‌ ఓపెన్‌ కాలేదు. గతేడాది దీపావళి సమయంలో బీసెంట్‌ రోడ్డులో పర్యటించిన సీఎం చంద్రబాబును దుర్గారావు కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు పెన్షన్‌, ఇల్లు మంజూరు చేయాలని, జీవనోపాధి కల్పించాలని కోరాడు. చంద్రబాబు స్పందించి అతనికి పెన్షన్‌, సొంతిల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఆరునెలలుగా నెరవేరలేదు. నాలుగైదు సార్లు పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదు.

7

Advertisement
 
Advertisement
Advertisement