ద్వితీయంలో తృతీయం | - | Sakshi
Sakshi News home page

ద్వితీయంలో తృతీయం

Apr 16 2026 12:05 PM | Updated on Apr 16 2026 12:05 PM

● ఇంటర్‌ ఫలితాల్లో దిగజారిన ఎన్టీఆర్‌ జిల్లా స్థానం ● ద్వితీయ సంవత్సరంలో 87 శాతం ఉత్తీర్ణతతో తృతీయ స్థానం ● మొదటి సంవత్సరంలో84 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానం ● ఈ ఏడాది పెరిగిన ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం

ప్రభుత్వ కళాశాలల్లో 70 శాతం ఉత్తీర్ణత

కృష్ణాదే అగ్రస్థానం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్‌ పరీ క్షల ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాది 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తృతీయ స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది 89 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రథమ సంవత్స రంలో ఉత్తీర్ణత పెరగ్గా, ద్వితీయ సంవత్సరం తగ్గింది. మొత్తంగా 2024 సంవత్స రంలో ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లా గడిచిన రెండేళ్లగా దిగజారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

బాలికలదే పైచేయి

మొదటి సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విద్యార్థులు 34,510 మంది పరీక్షకు హాజరవగా 29,103 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరంలో 36,151 మంది పరీక్షకు హాజరవగా 31,453 మంది ఉత్తీర్ణులయ్యారు. 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్‌ జనరల్‌ పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం 16,658 మంది పరీక్షలు రాయగా 14,155 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 85 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 16,835 మంది పరీక్షలకు హాజరవగా 14,670 మంది ఉత్తీర్ణతను సాధించారు. 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురి విషయంలో మొదటి ఏడాది 80, ద్వితీయ సంవత్సరం 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రైవేట్‌ కళాశాలల ఉత్తీర్ణత ఇలా..

జిల్లాలో అన్‌ఎయిడెడ్‌ / ప్రైవేట్‌ కళాశాలలకు సంబంధించి మొదటి ఏడాది 32,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 27,593 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం ఉత్తీర్ణత నమో దైంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 34,751 మందికి 29,939 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 86 శాతంగా నమోదైంది.

ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2025–26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 90, ద్వితీయ సంవత్స రంలో 92 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానం దక్కించుకున్నారు. 2024–25లో ప్రథమ సంవత్సరంలో 85, రెండో సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత ఒక శాతం తగ్గగా, ప్రథమ సంవత్సరంలో ఐదు శాతం పెరిగింది.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 70 శాతం ఫలితాలను సాధించారు. జిల్లాలో సుమారుగా పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 1,670 మంది విద్యా ర్థులు హాజరవగా 860 మంది ఉత్తీర్ణత సాధించారు. 51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరానికి సంబంధించి 1,153 మంది విద్యార్థులకు 806 మంది ఉత్తీర్ణుయ్యారు. 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ మొదటి ఏడాది 86 శాతం, రెండో ఏడాది 92 శాతం, ఏపీటీడబ్ల్యూఆర్‌ మొదటి ఏడాది 97 శాతం, రెండో ఏడాది 95 శాతం, హైస్కూల్‌ ప్లస్‌ మొదటి ఏడాది 37 శాతం, రెండో ఏడాది 57 శాతం, మోడల్‌ స్కూల్‌ మొదటి ఏడాది 85 శాతం, రెండో ఏడాది 93 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 81 శాతం, రెండో ఏడాది 90 శాతం ఫలితాలను సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement