
వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీకి చెందిన పెద్ది రాంబాయిమ్మ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు తెలుగు దేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ జోగి రమేష్ నివాసంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన మహిళలను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్, ఎంపీటీసీలు కొరగంజి సత్యనారాయణ, షేక్ సైదాబీ వలీ, కాలనీ నాయకులు నక్కా ప్రభుదాస్, మారపాక రాంబాబు, కుంభా నాగరాజు, ముళ్ల లాజర్, టీఎల్ రాజు, ఎస్‌కే షరీఫ్, గద్దల లాజర్, విన్నపాల రంగారావు, చల్లా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు జోగి రమేష్‌ను సత్కరించారు.
చిల్లకల్లు(జగ్గయ్యపేట): పద్నాలుగేళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన నాదెండ్ల నాగరాజు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాగరాజు స్నేహితుడు అమరబోయిన గోపి పరిచయమై శారీరకంగా కలిశారు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లి వైద్య పరీక్షలు చేయించటంతో ఏడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదుచేయగా నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
కంచికచర్ల: వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన కంచికచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న కారు కంచికచర్ల ఫ్‌లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన వట్టికూటి చలపతిరావు(45) అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడకు చెందిన కారు డ్రైవర్ విశ్వనాథపల్లి గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు