
రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి
వయస్సు 40 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటితే సీటీ కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఒక్కోసారి ఈసీజీ నార్మల్ వచ్చినా గుండెపోటు రావచ్చు. చాలా మందికి గుండెపోటు గ్యాస్ నొప్పిలానే ఉంటుంది. ఛాతీలో వచ్చిన నొప్పిని అశ్రద్ధ చేయకుండా, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ డయాబెటీస్ ఉన్న వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ట్, సెంటినీ విజయవాడ
●