
డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇప్పుడు రెడ్‌బుక్ పేరుతో మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, వారికి డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం’ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్యులను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెడ్ బుక్ తరహాలో తాము చిల్లరగా వ్యవహరించబోమని స్పష్టంచేశారు. కూటమి నాయకులతో పాటు కొంత మంది అధికారులు కూడా వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని స్పష్టంచేశారు.
అసెంబ్లీకి తాగొచ్చిన బాలకృష్ణ
నూటికి నూరు పాళ్లు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాల కృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఏం చేస్తు న్నారు, తమ అన్నయ్య చిరంజీవిని వాడూ వీడూ అని బాలకృష్ణ హేళన చేసినా స్పందించరా అని ప్రశ్నించారు. నాగబాబు, పవన్‌కల్యాణ్ తమ అమ్మను తిట్టించిన వారికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు చెక్ పెట్టేలా డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పని చేస్తున్నారని, డిజిటల్ బుక్‌లో ఏ అధికారి పేరు వస్తుందో వారిపై తాము అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ జగ్గయ్య పేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షుడు దేవినేని అవినాష్
పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో
డిజిటల్ బుక్ ఆవిష్కరణ