పెనమలూరు/ఉయ్యూరు: పెనమలూరు మండలం కానూరులో గంజాయి నిల్వ ఉంచిన ఇంటిపై ఉయ్యూరు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.శేషగిరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. 14 కిలోల 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరులో రెండంతస్తుల భవనంలో గంజాయి ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని సీఐ తెలిపారు.
గంజాయిని స్వాధీనం చేసుకుని పానెం రామమోహన్‌రావు, యలమంచిలి మురళీకృష్ణప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నంది కేశవరావు, వేణుగోపాలరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కానూరులో గంజాయి పట్టివేత