
కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
గుడివాడ టౌన్: ఆడుకుంటున్న ఏడే ఏళ్ల బాలుడిపై కుక్క దాడికి తెగబడిన ఘటన గుడివాడ పట్టణంలో బుధవారం జరిగింది. స్థానిక లీలామహల్ రోడ్డులోని ఒక అపార్ట్‌మెంట్‌లో బాలుడు సైకిల్‌పై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వస్తున్న కొందరు వ్యక్తులు దీనిని గమనించి కుక్కను తరిమి బాలుడిని రక్షించారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు మునిసిపల్ కమిషనర్‌ను కోరారు.
కృత్తివెన్ను: గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో 216 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ తెలగంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు (58) దుర్మరణం చెందారు. పాలకొల్లు నుంచి బంటుమిల్లి వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి రమణను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. రమణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పైడిబాబు తెలిపారు. మండల పరిసర గ్రామాల్లో పేద ప్రజలకు డబ్బులు డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకుని వైద్యం చేయడంలో రమణకు మంచి పేరు ఉంది. ఆయన మరణవార్త తెలుసుకుని మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.
గూడూరు:ేస్నహితులతో కలసి మంగళవారం స్నానం చేసేందుకు జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో దిగి గల్లంతైన వెలుపూడి జీవన్‌కుమార్ (12) బుధవారం శవమై తేలాడు. మంగ ళవారం రాత్రి నుంచి తల్లిదండ్రులతో పాటుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం తెల్లవారుజామున మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై రామరాజుపాలెం వంతెన కింద కట్టిన వలకు జీవన్‌కుమార్ మృతదేహం చిక్కింది. పోలీసులు శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేయించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కళ్లెదుట ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లవాడు విగతజీవిగా మారడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. గూడూరు ఏఎస్‌ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు