
ఎడ్లంకలో మరో నాలుగు ఇళ్లు ఏటిపాలు
అవనిగడ్డ: మండలంలోని పాత ఎడ్లంక గ్రామస్తులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. వరద ఉధృతికి ఎప్పుడు ఏ ఇల్లు కృష్ణా నదిలో కలిసిపోతుందోనని భయాందోళనకు గురవుతు న్నారు. ఈ ఏడాది పలు సార్లు వచ్చిన వరదలకు తిరుపతమ్మ ఆలయంతో పాటు నాలుగిళ్లు కొట్టుకు పోయాయి. మునిపల్లి వెంకట నాగేశ్వరరావు, మునిపల్లి గణేష్ కుమార్, మునిపల్లి రాజేంద్రప్రసాద్, పెమ్మడి మాధవి, పెమ్మడి లక్ష్మికి చెందన మరో నాలుగు ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో పలుసార్లు వచ్చిన వరదలకు గ్రామం చుట్టూ గట్టు భారీగా కోతకు గురైంది. మూడు ఎకరాల వరకు భూభాగం కృష్ణా నదిలో కలిసిపోయింది. ఇప్పటి వరకూ ఇళ్లు కోల్పోయిన వారికి వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయ లేదని బాధితులు ఆరోపించారు.

ఎడ్లంకలో మరో నాలుగు ఇళ్లు ఏటిపాలు