గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన భవానీపురం వర్క్‌షాపు రోడ్డులో జరిగింది. భవానీపురానికి చెందిన లక్ష్మీదేవి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కొంత కాలంగా భర్త వివాదాల కారణంగా అతని నుంచి విడిగా ఉంటూ.. అప్పారావు అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. మంగళవారం రాత్రి పనులకు వెళ్లి వస్తుండగా వర్క్‌షాపు సమీపంలోకి రాగానే ఆమైపె మద్యం మత్తులో అప్పారావు కత్తితో మెడపై దాడి చేశాడు.
అతని నుంచి తప్పించుకునేందుకు ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి వర్క్‌షాపు రోడ్డులో పడిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు ఆమెను గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. కొన ఊపిరితో ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను సిటీలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమైపె కత్తితో దాడి చేసిన అప్పారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.