
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలి
వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందిన చుక్కల జింక, కొండముచ్చు
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్య ప్రాణులు వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు వదులుతున్నాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని మూలపాడు సమీపంలో వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో పడి చుక్కల జింక, కొండముచ్చు మంగళవారం మృత్యువాత పడటం సంచలనంగా మారింది. అటవీశాఖ అధికారులు కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మూలపాడు గ్రామం నుంచి ఏసీఏ క్రికెట్ స్టేడియం, సీతాకొకచిలుకల పార్క్‌కు చక్కటి రహదారి ఏర్పాటు చేయడంతో వేటగాళ్లు అడవికి వెళ్లేందుకు రాజమార్గంగా మారింది. అడవి పందుల మాసం వారంలో కనీసం మూడు రోజుల పాటు మూలపాడులో అందుబాటులో ఉండటం గమనార్హం. కొండముచ్చు మాంసాన్ని వేట మాసంగా విక్రయించడం ఈ ప్రాంతంలో పరిపాటిగా మారింది. వన్యప్రాణుల మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలి