
రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో కేసులకు సత్వర పరిష్కా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దీర్ఘకాలికంగా పరిష్కారం కాని రైల్వే సంబంధిత వివాదాలను సత్వరమే పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అమరావతి బెంచ్ సభ్యురాలు (జ్యుడిషియల్) డాక్టర్ ఆర్.సత్యభామ అన్నారు. ఈ నెల 22, 23 తేదీలలో గుంటూరులో రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సత్యభామ మాట్లాడుతూ రైల్వే బాధితులకు పరిష్కారాలను వేగవంతం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 31 ప్రతిపాదిత కేసులను ఎంపిక చేసి వాటిలోని బాధితులకు రైల్వే సంబంధిత క్లెయిమ్స్, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా కేసులు వేగవంతమైన పరిష్కారంతో పాటు చట్టపరమైన పక్రియను తగ్గించడం, బాధితులకు అనుకూలమైన పరిష్కారం లభిస్తుందన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నిర్వహించే లోక్ అదాలత్ సేవలను రైల్వే సంబంధిత బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం జరిగిన లోక్ అదాలత్‌లో అమరావతి బెంచ్ అదనపు రిజిస్ట్రార్ రాజేంద్ర ప్రసాద్, డెప్యూటీ సీసీఎం బాలాజీ కిరణ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు.