
ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. జర్నలిస్టులపై విచారణ, అరెస్టులు అంటూ వేధింపులకు పాల్పడుతోంది. ప్రశ్నించే మీడియా గొంతు నొక్కేయటం అంటే స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే. కూటమి ప్రభుత్వ పెద్దలకు నిజాలు మింగుడు పడటంలేదు. సాక్షి పత్రికపై కక్షసాధింపు చర్యలను మానుకోవాలి. సాక్షాత్తూ ఎడిటర్ పైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్న కూటమి ప్రభుత్వపు పోకడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెబతారు.
– బెల్లం దుర్గ, డెప్యూటీ మేయర్, విజయవాడ