
వాస్తవాలు రాసే సాక్షిపై కేసులా?
వాస్తవాలను నిర్భయంగా ప్రచురిస్తున్న సాక్షి దినపత్రికపై కూటమి ప్రభుత్వం కేసులు బనాయించడం హేయం. సాక్షి ఎడిటర్‌తో పాటు పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించాలి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ప్రజల గొంతుకను వినిపిస్తున్న సాక్షిపై కక్షపూరిత చర్యలకు పాల్పడడం అప్రజాస్వామికం. పత్రికలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం అంటే కలానికి సంకెళ్లు వేయడమే. పత్రికల్లో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరైనది కాదు.
– చిటికిన వెంకటేశ్వరమ్మ, మేయర్, మచిలీపట్నం