ఆలయ పరిసరాల్లోనూ ప్రచారార్భాటం | - | Sakshi
Sakshi News home page

ఆలయ పరిసరాల్లోనూ ప్రచారార్భాటం

Sep 19 2025 2:58 AM | Updated on Sep 19 2025 12:29 PM

 Campaign cutouts installed at the Eastern Canal near Indrakiladri

ఇంద్రకీలాద్రి సమీపంలో తూర్పు కెనాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార కటౌట్‌లు

విజయవాడ దుర్గగుడి పరిసరాలలో ఎటువంటి రాజకీయ ప్రచార కటౌట్‌లు ఏర్పాటు చేయరాదనే నిబంధనను తోసిరాజని గుడి సమీపంలో, తూర్పు కెనాల్‌ వద్ద రాజకీయ నాయకుల చిత్రాలతో దసరా ఉత్సవాలు, ఇతర ప్రచార భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. నిత్యం వాహనాలు, భక్తులు తిరిగే ప్రధాన రోడ్డు ఇది. 

దసరా ఉత్పవాల భక్తుల క్యూలైన్లు కూడా ఈ కటౌట్స్‌ ఎదుటే ఉంటాయి. ఇటీవల భారీ వర్షం, ఈదురుగాలులకు సీఎం చంద్ర బాబు, మంత్రి లోకేష్‌ల కటౌట్‌ కూలిపోయింది. ఆ సమయంలో భక్తుల రద్దీ, వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే ప్రదేశంలో నాయకుల ఫొటోలతో భారీ కటౌట్లు వెలిశాయి. అధికారులు వీటిని గుర్తించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

– నడిపూడి కిషోర్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయవాడ

A propaganda cutout was blown to the ground by strong winds1
1/1

దుర్గగుడి సమీపంలో తూర్పు కెనాల్‌ వద్ద ఈదురుగాలికి నేలకు ఒరిగిన ప్రచార కటౌట్‌ (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement