
లాటరీ ద్వారా 7 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి (2025 నుంచి 2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఏడు బార్లకు లాటరీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎకై ్సజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో గురువారం లాటరీ తీశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించామన్నారు. తొలి విడత నోటిఫికేషన్‌లో భాగంగా ఓపెన్ కేటగిరీలో 69 బార్లు, గీత కులాల వారికి కేటాయించిన 10 బార్లు మొత్తం 79 బార్ల కేటా యింపు గతంలోనే పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన 61 బార్ల కేటాయింపునకు ఈ నెల మూడో తేదీన మరోసారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, దీనికి 17వ తేదీ గడువు ముగిసే సమయానికి ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 61 బార్లకు గాను ఏడు బార్లకు మాత్రమే మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయన్నారు. 54 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదన్నారు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులొచ్చిన ఏడు బార్లకు లాటరీ నిర్వహించి కేటాయించామని, 54 బార్లకు దరఖాస్తులు రాని కారణంగా కేటాయింపులు నిలిచిపోయాయన్నారు. తిరువూరు నగర పంచాయతీ పరిధిలో ఒకటి, జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు బార్లు, విజయవాడ నగర పరిధిలో 46 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయ న్నారు. లాటరీలో బార్లు దక్కించుకున్న దరఖాస్తుదారులు నిర్ణయించిన వార్షిక లైసెన్స్ ఫీజులో ఆరవ వంతు సొమ్ము ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలని కోరారు.