
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2025
–8లోu
జి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ముందు భాగంలో ప్రహరీ ధ్వంసమవ డంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ప్రహరీ సైతం నిర్మించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోని ఐరన్ విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లోనూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద నిర్మాణం, మరమ్మతులు చేసిన హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మరమ్మ తులు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబాడీపేట హాస్టల్‌లో బెడ్‌లు లేకపోవటంతో చిన్నారులు నేలపైనే నిద్రిస్తున్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా లోని విద్యార్థి వసతి గృహాలు అధ్వానంగా తయా రయ్యాయి. కూటమి పాలకుల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం, నిధుల లేమితో కనీస వసతులకు కూడా నోచుకోక పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న సమస్యలతో అల్లాడుతున్నారు. బెడ్‌లు, దుప్పట్లు లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితులు దాపురించాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చలికి గజగజా వణుకుతున్నారు. ఈ సమస్యలను తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపించడానికి వెనుకంజ వేస్తున్నారు.
తరగతి గదుల్లోనే వసతి
మైలవరం మండలం కొండపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులకు కేవలం 15 గదులు మాత్రమే ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే ఉదయం తరగతుల నిర్వహణ, రాత్రి విద్యార్థులు నిద్రించేందుకు ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల భోజనానికి పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ పట్టి సన్న బియ్యంగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరో పిస్తున్నారు. కంచికచర్ల ఎస్సీ హాస్టల్‌ను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు– నేడు పథకం ద్వారా ఆధునికీకరించారు. మండలంలోని పెండ్యాల బీసీ హాస్టల్‌లో దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. చందర్లపాడు ఎస్సీ హాస్టల్‌లో మాత్రం అరకొర వసతులు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి.
వెంటాడుతున్న గురువుల కొరత
మైలవరం నియోజకవర్గంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 260 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ పది మంది ఉపాధ్యాయులు అవసరం. అయితే ఏడుగురు మాత్రమే ఉన్నారు. జి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భోజనం చేసే డైనింగ్ హాలు సరిపో వడంలేదు. విద్యార్థులను మూడు బ్యాచ్‌లుగా విభజించి భోజనం వడ్డిస్తున్నారు. ఇక్కడ 64 మరుగుదొడ్లలో కేవలం 38 మాత్రమే పని చేస్తున్నాయి. డార్మిటరీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది.
7
న్యూస్‌రీల్
ప్రశ్నార్థకంగా మారిన భద్రత
సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు చలికి వణుకుతూ నేలపై నిద్రించాల్సిన పరిస్థితి విద్యార్థులకు చాలినన్ని మరుగుదొడ్లు లేని వైనం ధ్వంసమైన ప్రహరీలకు మరమ్మతులు శూన్యం విషపురుగుల సంచారంతో భయం.. భయం
విషపురుగుల సంచారం
విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి లోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వసతి గృహం పొలాల మధ్య ఉండటంతో రాత్రి వేళల్లో విష పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లకల్లు బీసీ వసతి గృహంలో కిటికీలకు మెస్ లేకపోవటంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. బెడ్‌లు లేకపోవటంతో నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. వసతి గృహం ప్రహరీ కూలిపోవటంతో రాత్రి వేళల్లో విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పెనుగంచి ప్రోలులో బీసీ వసతి గృహం అద్దె భవ నంలో నడుస్తోంది. 60 మంది విద్యార్థులకు నాలుగు మరుగు దొడ్లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవటంతో నేలపైనే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. పెంకుటిల్లు కావటంతో దూలాలకు చెదలు పట్టి ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. కనీస వసతులు సైతం కల్పించకపోవటంతో హాస్టల్స్‌లోని విద్యార్థులు అల్లాడుతున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల్లోనే హాస్టల్స్ దయనీయ పరిస్థితులు ఉంటే మిగిలిన జిల్లాల్లో ఇంకెంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నాడు–నేడు ద్వారా విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుంది. ఆ పనులను నిలిపివేసి కూటమి సర్కార్ విద్యార్థులను ఇబ్బందులు పాలు చేస్తుంది.
– ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ