లండన్‌లో మొట్టమొదటి బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ

Trs Is Now Officially Brs Party: Inauguration Of Brs Party Flag In London - Sakshi

త్వరలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి

లండన్: ఇటీవల అధికారికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బీ.ఆర్.ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని చారిత్రక టవర్‌ బ్రిడ్జి వద్ద బీఆర్‌ఎస్‌ జెండా మంగళవారం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎన్నారైసెల్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి జెండాను సైతం లండన్ లోని చారిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు. 

నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం దేశమంతా అమలు కావాలంటే అది కేవలం కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ఎన్నారైలంతా విశ్వసిస్తున్నారన్నారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులంతా బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరి కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అలాగే భారత్ నుండి బీ.ఆర్.ఎస్ నాయకులని ఆహ్వానించి త్వరలో ఘనంగా బీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్ని నిర్వహిస్తామని అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక తెలిపారు.

"దేశ్ కి నేత కేసీఆర్" "అబ్కి బార్ కిసాన్ సర్కార్" నినాదాలతో లండన్ టవర్ బ్రిడ్జి ప్రాంతం మారుమోగింది. కేసీఆర్ ప్రతీ పిలుపుకి స్పందించి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తెలిపారు. అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సీక, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, ఫృద్వి రావుల, మధుయాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top