మాతృభూమి ‍కోసం.. ఎన్నారైల సేవా కార్యక్రమాలు | Sakshi
Sakshi News home page

మాతృభూమి ‍కోసం.. ఎన్నారైల సేవా కార్యక్రమాలు

Published Wed, Dec 13 2023 10:17 AM

Telangana American Telugu Association Seva Days Will Be Organised - Sakshi

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ TTA ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాతృభూమికి సేవ చేయడానికి 'సేవా డేస్‌' పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు 11-23 వరకు తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, కో ఆర్డినేటర్‌ సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమాల గురించి టీటీఏ టీమ్ వివరించింది.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ TTA ఆధ్వర్యంలో డిసెంబర్11 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు TTA అధ్యక్షుడు కంచర కుంట్ల వంశీరెడ్డి తెలిపారు. అమెరికాలో స్థిరపడిన వారంతా మాతృభూమిలోని పేదలకు తమ వంతు సాయం చేసేందుకు వేదికగా సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో15 జిల్లాలు సందర్శించి ‘టీటీఏ సేవా డేస్​’ పేరుతో అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. డిసెంబర్11న మెడికల్ క్యాంప్, 12న టీ హబ్​లో టెక్నాలజీపై,16న ఆరోగ్యంపై అవగాహనకు నెక్లెస్ ​రోడ్డులో 5కే రన్ నిర్వహిస్తున్నామన్నారు. 18న వరంగల్​లో మెగా జాబ్​మేళాతో పాటు వీల్​చైర్స్​పంపిణీ, హెల్త్​క్యాంప్ తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 17న వికారాబాద్ లో కృత్రిమ అవయవాల పంపిణీ, 23న రవీంద్రభారతిలో సేవాడేస్​ ముగింపు సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement