ఫిలడెల్ఫియాలో ఘనంగా తానా వన భోజనాలు

Tana Team Conducted Vanabhojanalu In Philadelphia - Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో వన భోజనాలు ఘనంగా జరిగాయి. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో తానా సభ్యులు వన భోజన కార్యక్రమాల్ని నిర్వహించారు.  మిడ్ అట్లాంటిక్, ఫిలడెల్ఫియా‌ నగర పరిధిలో వందల సంఖ్యలో తెలుగు వారు, న్యూ జెర్సీ, డెలావేర్ నుంచి,టెక్సాస్ నుండి నాగరాజు నలజుల, వర్జీనియా నుండి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుండి సాయి జరుగుల ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి మాట్లాడుతూ..23వ తానా మహాసభలు 2023 జులై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నట్లు తెలిపారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి నేతృత్వంలో సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. ఏర్పాట్లలో భాగంగా నవంబర్ 5 నాడు పెన్సిల్వేనియా వార్మినిస్టర్ నగరంలోని ఫ్యూజ్ బాంక్వెట్ హాల్‌లో తానా 23వ మహాసభల కిక్ ఆఫ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

తానా లీడర్షిప్ టీం నుండి ఈ కార్యక్రమంలో సునీల్ కోగంటి, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా 23వ మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, టీం స్క్వేర్ కోచైర్ కిరణ్ కొత్తపల్లి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వనాధ్ కోగంటి, హరనాథ్ దొడ్డపనేని, లీలా కృష్ణ దావులూరి, శ్రీనివాస్ భారతవరపు, సుధాకర్ కంద్యాల, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ  తదితరులు సహాయ సహకారాలు అందించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top