దేశం కాని దేశంలో భారత మహిళ ఒంటరి పోరాటం

Stranded Mother And her toddler baby girl Safely returned to Warangal from Saudi - Sakshi

చేయని తప్పుకు రెండేళ్ల చిన్నారి ఆమె తల్లి దాదాపు ఏడాదిన్నరగా సౌదీ అరేబియాలో మానసిక క్షోభని అనుభవించారు. రెక్కల కష్టం కళ్ల ముందే కరిగిపోతుందేమో అనే ఆందోళనతో ఏడాదిగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే చదువు అందించిన ధైర్యంతో పాటు సమకాలిన అంశాల పట్ల అవగాహనతో దేశం కాని దేశంలో ఆమె మహిళ ఒంటి చేత్తో పోరాటం చేసింది. 

సౌదీలో ఉద్యోగం
వరంగల్‌ నగరానికి చెందిన మామిడాల రమ్యకృష్ణ సౌదీ అరేబియాలో ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ప్రసవం కోసం ఆమె ఇండియా వచ్చింది. 2019 సెప్టెంబరులో ఓ పాపకి జన్మనిచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు పాపకి విజిటింగ్‌ వీసా తీసుకుని సౌదికి వెళ్లి పోయింది. 

వీసా చిక్కులు
విజిటింగ్‌ వీసా గడువు ముగిసిపోయే సమయంలో ఎక్స్‌టెన్షన్‌ కోసం దరఖాస్తు చేయగా వీసా గడువు పొడిగించినట్టుగా ఆమెకు ఎలక్ట్రానిక్‌ మెసేజ్‌లు వచ్చాయి. అయితే టెక్నికల్‌ గ్లిచెస్‌ వల్ల అధికారిక డాక్యుమెంట్లలో అది నమోదు కాలేదు. ఇంతలో 2020 ఆరంభం నుంచి కరోనా వచ్చి పడటం.. లాక్‌డౌన్‌లతో అన్ని వ్యవస్థలు దాదాపుగా స్థంభించిపోయాయి.

భారీ జరిమాన
తన కూతురు వీసా విషయంలో జరిగిన పొరపాటు సరి చేయాల్సిందిగా రమ్యకృష్ణ మామిడాల హస్సా, దమ్మన్‌, రియాద్‌లో ఉన్న అధికారుల వెంట పడింది. చివరకు ఆమె కేసును పరిశీలించిన అధికారులు.. రమ్యకృష్ణదే తప్పంటూ తేల్చారు. సకాలంలో వీసా తీసుకోనందుకు జరిమాగా సుమారు 30,000 రియాద్‌లు (ఇండియన్‌ కరెన్సీలో రూ. 6 లక్షల రూపాయలు) చెల్లించాలు ఆదేశాలు జారీ చేశారు. అవి చెల్లించకుండా దేశాన్ని విడిచి వెళ్లేది లేదంటూ తేల్చి చెప్పారు.

పోరాటం
చేయని తప్పుకు శిక్ష వేయడమే కాకుండా రెక్కలు ముక్కలు చేసిన సంపాదించిన డబ్బులు ఫైన్‌గా కట్టాలంటూ చెప్పడంతో రమ్యకృష్ణ అవాక్కయ్యింది. సౌదీ అధికారులెవరు ఆమెకు అండగా నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. రమ్య పరిస్థితి తెలుసుకున్న ఇండియాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు బోరుమన్నారను. ఇలాంటి విపత్కర పరిస్థితిలో రెండేళ్ల బిడ్డకు తల్లిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తి​​స్తూనే మరోవైపు చేయని తప్పుకి చెల్లించాల్సిన భారీ జరిమాన తప్పించుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించింది.

వారి అండతో
చివరకు సౌదీలో ఇండియన్లకు అండగా నిలిచే ప్లీస్‌ ఇండియా అనే ఓ ఎన్నారై  గ్రూపు రమ్యకృష్ణ బాధను అర్థం చేసుకుంది. ఆమె తరఫున సౌదీ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. న్యాయ సహాయం అందించింది. గతంలో వీసా పొడిగింపుకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్సులు సమర్పించింది. చివరకు రమ్యకృష్ణ, ఆమె రెండున్నరేళ్ల కూతురు ఎటువంటి జరిమాన చెల్లించకుండా ఇండియాకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో జనవరి 26న రమ్యకృష్ణ ఆమె కూతురు ఇండియాకి వరంగల్‌కి చేరుకున్నారు. 
చదవండి: ఐసీయూలో తల్లి.. కెనడాలో కొడుకు.. ప్లీజ్‌ హెల్ప్‌

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top