సింగపూర్‌లో ఘనంగా మే డే వేడుకులు నిర్వహించిన సింగపూర్‌ తెలుగు సమాజం

Singapore Telugu Samajam Organized May Day Celebrations in Singapore - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగ‌పూర్‌లో ఆదివారం మే డేను ఘ‌నంగా నిర్వ‌హించారు. స్థానిక తెలుగు రెస్టారెంట్ల సహకారంతో 1200 మంది స్థానిక తెలుగు కార్మికుల‌కు బిర్యానీ పంపిణీ చేశారు. అంతేకాకుండా వారి యోగ‌క్షేమాలు తెలుసుకొని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. పూర్వ, ప్రస్తుత కార్యవర్గసభ్యులతోపాటు సభ్యులు, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ, తెలుగు కార్మిక సోదరులకు ఏ స‌మ‌స్య వ‌చ్చినా సింగపూర్ తెలుగు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుంద‌న్నారు. కొవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల రెండేళ్లు క‌లుసుకోలేక‌పోయామ‌ని, ఇప్పుడిలా క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. స్ధానిక రెస్టారెంట్స్ సహకారంతో కుటుంబాలకు దూరంగా ఉన్న సుమారు 1200 మంది కార్మిక సోదరులకు బిర్యానీ బాక్సులు అందించామని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు, కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి జ్యోతీశ్వర్‌ రెడ్డి తెలిపారు.

అన్నీ వేళలా కార్మిక సోదరులకు అండగా ఉంటూ...మరీ ముఖ్యంగా గత రెండు సంవత్సరాల క్లిష్ట సమయంలో సింగపూర్‌ తెలుగు సమాజం తరపున సహాయపడుతున్న పోతగాని నరసింహగౌడ్‌, నాగరాజు వారి సేవలను కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమానికి  హాజరైన తెలుగు వారికి, పలు  కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ , మే డే వేడుకలు విజయవంతం కావడానికి శ్రమించిన కార్యవర్గసభ్యులకీ , దాతలకు , సహకరించిన రెస్టారెంట్ యాజమాన్యాలకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.

చదవండి: అనాథల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top