కువైట్‌లో మహానేత వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

Kuwait NRIs Pays Tribute To YS Rajasekhara Reddy - Sakshi

కువైట్: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వై.ఎస్‌.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కువైట్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిపైనా క్రియేటివ్ మాస్ మస్తాన్ గారి డైరెక్షన్ లో వై.యస్.ఆర్ జిల్లా పెనగలూరు మండలంకు చెందిన పెడమల్లి మోహన్ రెడ్డి రచించి గానం చేసిన తొలి తెలుగు పాటను కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గ రెడ్డి గార్ల చేతుల మీదుగా ఈ పాటను విడుదుల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిపైనా ఇంతటి మంచి పాట చేసినందుకు మస్తాన్, మోహన్ రెడ్డిని అభినందించారు. కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు యం.వి నరసా రెడ్డి మాట్లాడుతూ.. సూర్య చంద్రలు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతముగా ఉంటారని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు.

ఆ జనహృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున నివాళిలు అర్పించారు. తదుపరి కోకన్వీనర్ యం.వి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి ప్రధాన కోశాధికారి నాయిని మహేశ్వర రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం లీడర్ మర్రి కల్యాణ్, బీసీ సంఘం లీడర్ రమణ యాదవ్, మైనారిటీ విభాగం సభ్యులు రహంతుల్లా, యువజన విభాగం సభ్యులు షేక్ సబ్దర్, హరినాథ్ చౌదరి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షలు లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు.


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top