న్యూజెర్సీ లో ఘనంగా ‘‘ఆటా’’ సయ్యంది పాదం నృత్య పోటీలు

Details about ATA Sayyandi Padam Dance Competition - Sakshi

అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో నిర్వహించారు.  కూచిపూడి, భరత నాట్యం, జానపదం ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.  ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సీ  సయ్యంది పాదం ఇంచార్జీలు ఇందిరా  దీక్షిత్, మాధవి అరువ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరిగాయి. మ్యూజిక్ ఆడియో సిస్టంను ఏర్పాటు చేసిన రాజ్ చిలుముల,  కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డిలు విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం బృందానికి అభినందనలు తెలిపారు. 

సక్సెస్‌ చేయడంలో..
వర్జీనియా నుండి న్యూ జెర్సీకు  వచ్చిన సయ్యంది పాదం ఛైర్ సుధారాణి కొండపు,  కో-ఛైర్ భాను మాగులూరి గారికి  ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. వాలంటీర్లకు, న్యూజెర్సీ ఆటా టీమ్ రాజ్ చిలుముల, రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. ఆటా బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించారు.  ఈ కార్యక్రమం గ్రాండ్  సక్సెస్ అవడానికి ఇందిరా  దీక్షిత్,  మాధవి అరువ, నందిని దార్గుల, వాణి అనుగుల, రాజ్ చిలుముల, రఘువీర్ రెడ్డి , సంతోష్ రెడ్డి, శరత్ వేముల , విజయ్ కుందూరు,  మహీందర్ రెడ్డి ముసుకు, రవీందర్ గూడూరు , శ్రీకాంత్ గుడిపాటి , శ్రీనివాస్ దార్గుల, శైల మండల ,బిందు, వినోద్ కోడూరు, రామ్ రెడ్డి వేముల, శివాని, విజయ ,ప్రవీణ్, నిహారిక , అపర్ణ,  ప్రదీప్ కట్ట , విలాస్ రెడ్డి జంబులతో పాటు మిగితా వలంటీర్లు కృషి చేసారు. వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం పట్ల సయ్యంది పాదం పోటీల ఛైర్ సుధా కొండపు, సలహాదారు రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు.

విజేతల వివరాలు
సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి, సోలో నాన్ క్లాసికల్ జూనియర్ – సంజన నూకెళ్ల,  సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి, సోలో జూనియర్ క్లాసికల్ – జాన్వీ ఇరివిచెట్టి, నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్, నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ – శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్,  గ్రూప్ జూనియర్ – చార్వి పొట్లూరి, శ్రీనికా కృష్ణన్‌లు ఉన్నారు. 

ఆటా 17వ కన్వెన్షన్‌
ఆటా 17వ కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్‌ను వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్‌లో జూలె 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, బోర్డు ఆఫ్ ట్రస్టీలు వివిధ కమిటీల  ఆధ్వర్యములో  అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభలు జరగబోతున్నాయి. కావున తెలుగువారందరూ ఈ మహాసభలకు హాజరై, భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు.

ఇళయరాజ సంగీత విభావరి
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్ తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు.

చదవండి: న్యూజెర్సీలో ‘తెలంగాణ’ ఉట్టిపడేలా ఉత్సవాలు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top