
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు వర్చువల్ మోడ్‌లో జరిగాయి. ఫేస్‌బుక్ , యూట్యూబ్ వేదికలుగా సెప్టెంబరు 4న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగవత పద్యాలు, కీర్తనలు ఆలపించారు.
వివిధ దేశాలకు చెందిన 75 మంది పిల్లల భాగవతంలో పలు ఘట్టాలకు సంబంధించి కళా ప్రదర్శనలు చేశారు. సింగపూర్, భారత్‌ల నుంచే కాకుండా అమెరికా, మలేషియా దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి, షర్మిల, కిడాంబి విక్రమాదిత్య, విద్య కాపవరపు, అపర్ణ ధార్వాడ వంటి ప్రముఖుల విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.