ఆపి 40 వార్షిక సదస్సు వివరాలు

AAPI 40th Convention Details - Sakshi

ప్రతి భారతీయుడు గర్వించేలా ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) 40వ వార్షిక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. టెక్సస్‌లోని శాన్ అంటోనియో నగరంలో జూన్ 23 నుంచి 26 వరకు ఈ వేడుకలు జరుగుతాయని ఆపి అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నామని ఆమె తెలిపారు. అందుకోసం కోసం కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సీఈవో అడివి వెంకీ 

భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్లలో అమెరికా వచ్చిన వాళ్లు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారని తెలిపారు. మొక్కవోని ధైర్యంతో ఆ కష్టాలను అధిగమించి గౌరవంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులంతా కలిసి 1980 కాలంలో ఏర్పాటు చేసుకున్నదే ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) అని అనుపమ గొటిముకుల తెలిపారు.  ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కుంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్చి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో ఆపి తరఫున చర్చించడం జరిగిందని ఆమె తెలిపారు.

ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి సత్కరిస్తున్నామని అనుపమ వెల్లడించారు. సత్కారం అందుకునే వారిలో సునీల్‌ గావాస్కర్‌ (క్రికెటర్‌), డాక్టర్ రాహుల్ గుప్త (డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ), డాక్టర్ సౌజన్య మోహన్ (టెక్సస్ గ్రూప్), ప్రైమ్ హెల్త్ కేర్ సిఇఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్లలు ఉన్నారు. 

డాక్టర్ దువ్వూరుకి పురస్కారం 
ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, అపి ఓవర్సీస్ కో ఆర్డినేటర్డా క్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి కి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు.
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top