ఎలా ఉందంటే.. | - | Sakshi
Sakshi News home page

ఎలా ఉందంటే..

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

నేటి వాతావరణం

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమా చారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమురం భీం, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్‌, జయ శంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్‌ జిల్లాలు ఉన్నాయి.

తొలి దశలో..

రైతు భరోసా పోర్టల్‌ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన సుమారు 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా నిజామాబాద్‌ జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 2,20,264 మంది రైతుల సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయశాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.

వాతావరణ మార్పుల గురించి నేరుగా రైతుల సెల్‌ఫోన్‌ వాట్సాప్‌కు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారిత సలహాలు అందనున్నాయి. వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారు. ఈమేరకు జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 2,20,264 మంది రైతుల సెల్‌ ఫోన్‌

నంబర్లను అనుసంధానం చేశారు.

రైతులకు విస్తృత అవకాశం కల్పించాలి

వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబో యే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ కు ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్‌ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్‌ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్‌మెంట్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌(డీఐఎల్‌), ఇండియా ఎవిడెన్స్‌ యాక్షన్‌ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలపై వ్యవసాయాధికారులు రైతులకు విస్తృత అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ముందస్తు సమాచారం

రైతుల వాట్సాప్‌కు నేరుగా

ఏఐ ఆధారిత సలహాలు

తొలిదశలో 17 జిల్లాల్లో

కార్యక్రమం అమలు

జిల్లాలో 2 లక్షల మందికి పైగా

సెల్‌ఫోన్‌ నంబర్ల అనుసంధానం

రైతు భరోసా పోర్టల్‌ ఆధారంగా సేవలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement