● ఎకై ్సజ్ శాఖలో ఏసీబీ గుబులు
● సిబ్బంది నుంచి అధికారుల
వరకు వసూళ్లు
నిజామాబాద్ అర్బన్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఏసీబీ అరెస్టు యుమడం ఆ శాఖలో గుబులు రేపింది. నెలవారీ మామూళ్లు వసూలు చేసే కొందరు వణికిపోతున్నారు. అయి తే ఈఎస్ అరెస్టుతో శాఖలో మార్పు వస్తుందా? లేదా? అనే చర్చ సాగుతోంది. జిల్లాలోని వైన్‌షాపులు, బార్‌లు, కల్లు సొసైటీల నుంచి శాఖ సిబ్బంది, అధికారులకు మామూళ్లు అందతున్నాయనే ఆరోపణలకు ఏసీబీ సోదాలు బలాన్ని చేకూర్చాయి.
జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, మోర్తాడ్ ప్రాంతాల్లో ఎకై ్సజ్ స్టేషన్‌లు ఉన్నాయి. నెలవారీ మామూళ్లలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు 60 శాతం తీసుకుని మిగతా 40శాతాన్ని కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఎస్‌హెచ్‌వోలకు వదిలేస్తున్నారని ఆరోపణలున్నాయి. కొందరు కిందిస్థాయి ఉద్యోగులే ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. బట్టీల్లో విక్రయించే కల్లును ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే తయారు చేయాలి. కానీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక సెంటర్‌లో కృత్రిమ కల్లు తయారుచేసి బట్టీలకు సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఎకై ్స జ్ సిబ్బందికి కాసులు కురిపిస్తోంది.
బార్‌లలో తనిఖీలు లేవు
జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి బార్‌లు నడిపిస్తుండగా, అతడికి చెందిన బార్‌లలో ఎకై ్సజ్ అధికారులు ఏనాడూ తనిఖీలు చేపట్టలేదని పలువురు ఆరోపిస్తున్నాయి. అనుమతుల సమయంలోనే ఎకై ్సజ్ అధికారికి రూ.5 లక్షలు అందించి ప్రతి నెల రూ.80 వేల వరకు ముట్టజెప్పుతుండడమే ఇందుకు కారణమంటున్నారు.
గంజాయి కేసుల్లో..
ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ గంజాయి రవాణా చేస్తున్న వారిని, విక్రయిస్తున్న వారిని పట్టుకుని కొన్ని రోజుల వరకు నిందితుల అరెస్టు చూపడం లేదనే విమర్శలు జిల్లా ఎకై ్సజ్‌శాఖపై ఉన్నాయి. పలు కేసుల్లో పట్టుబడిన గంజాయిలో నుంచి సగానికి పైగా తీసివేసి కేసు తీవ్రతను తగ్గించేందుకు భారీ మొత్తం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని అంతర్ జిల్లా గంజాయి ముఠా నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది.
దాడులు మరిచారు..
నవీపేట మండల కేంద్రానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరు నవీపేట చుట్టు పక్కల 14 గ్రామాలకు కల్లును సరఫరా చేస్తున్నారు. నిషేధిత అల్ఫ్రాజోలాన్ని ఆరు మండలాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఎకై ్సజ్‌శాఖ ఒక్కసారి కూడా దాడి చేయకపోవడం గమనార్హం. మూడు నెలల క్రితం బోధన్ డివిజన్‌లోని ఇద్దరు ఎకై ్సజ్ కానిస్టేబుళ్లకు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యింది. అయితే వారిద్దరు బదిలీ అవుతున్నామని వారం రోజుల ముందే నెలవారీ మామూళ్లను వసూలు చేసుకున్నారు. బదిలీపై వెళ్లిన మరో ఇద్దరు ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు అదే ప్రాంతానికి వెళ్లి మామూళ్లు అడుగగా వివాదం ఏర్పడింది. ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. జిల్లా కేంద్రంలోని ఓ కల్లు డిపో తీవ్ర వివాదంలో కురుకుపోయింది. విచారణ పేరుతో ఓ ఉన్నతాధికారి సంబంధిత డిపో నుంచి భారీ ఎత్తున మామూళ్లు తీసుకొని అనుమతి పునరుద్ధరించారనే విమర్శలున్నాయి.


