వాతావరణం, వర్షపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా అందజేస్తారు. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసు కోవడానికి మెట్ సెంటర్ హైదరాబాద్ అండ్ ఐఎండీ ( Metcentre Hyderabad & IMD) ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్‌నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ ఖచ్చిత మైన సమాచారాన్ని అందించనుంది.


