తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో బ్యాక్‌లాగ్‌పరీక్షలు జులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2016, 2017, 2018, 2019, 2020 బ్యాచ్‌ల డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశంగా ఇస్తున్న బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. in లో పొందుపర్చినట్లు తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప రిధిలోని బీఈడీ, బీపెడ్ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సి టీ వెబ్‌సైట్ www.telanganauniversity. ac.inను సంప్రదించాలని సూచించారు.
కమ్మర్‌పల్లి: ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మండలంలోని ఆయా పాఠశాలలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు మంజూరు చేయడంతోపాటు పీఆర్‌సీ, రిపోర్టులు, ఈహెచ్‌ఎస్ కార్డులను పంపిణీ చేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయడంతోపాటు, ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని తపస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. తపస్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు సల్లూరి కిషన్‌గౌడ్, డివిజన్ ప్రతినిధులు శంకర్‌గౌడ్, వేణు, రవి, ప్రసాద్, స్వర్ణలత పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని మహ్మదీయకాలనీకి చెందిన బాలుడు షోయబ్(16) అదృశ్యమైనట్లు రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం తెలిపారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన షోయబ్ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి(59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మురళి క్రియాశీల రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా పనిచేశారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యక ర్తలు, స్నేహితులు, బంధువులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.
వేల్పూర్: మండలంలోని మోతె గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేయడంతో పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, వరి నారుమడులు తడి ఆరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు త్వరగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.
నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖిల్లా చౌరస్తాలో ఉన్న బాల్యరక్ష భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పలు ఫైళ్లను తగలబెట్టినట్లు ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం రాత్రి బాల్యరక్ష భవనంలోకి చొరబడిన దుండగులు బీరువాలోని ఫైళ్లను తగులబెట్టారని చైల్డ్ హెల్త్‌లైన్ సూపర్‌వైజర్ కేతావత్ భీక్‌సింగ్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు.


