డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Jun 25 2026 6:05 AM | Updated on Jun 25 2026 6:05 AM

ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్‌

సోల్జర్‌గా మారాలి

పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య

బోధన్‌టౌన్‌(బోధన్‌): మాదక ద్రవ్య రహిత సమా జాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘మనబడి– మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇందూర్‌ మోడల్‌ హై స్కూల్‌లో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్‌ వ్యసనానికి బానిసలవుతున్న వారు తమ బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. లేని పక్షంలో డయల్‌ ఈగల్‌ ఫోర్స్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1908కు ఫోన్‌ చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మ ద్యం సేవించి వాహనాలు నడిపే వారు చేసిన తప్పునకు ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్‌ సోల్జర్‌గా మారి సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యాంటి డ్రగ్స్‌ సోల్జర్‌ సెల్ఫీపాయింట్‌ను ప్రారంభించారు. డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఏసీపీ శ్రీనివాస్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, ఇందూర్‌ మోడల్‌ హైస్కూల్‌ కరస్పాండెంట్‌ కోడాలి కిశోర్‌కుమార్‌, సీఐలు వెంకటనారాయణ, విజయ్‌బాబు, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement