మామూళ్ల మల్లారెడ్డి | - | Sakshi
Sakshi News home page

మామూళ్ల మల్లారెడ్డి

Jun 24 2026 1:41 AM | Updated on Jun 24 2026 1:41 AM

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

– 8లో u

ప్రగతినగర్‌లో ఎకై ్సజ్‌

సూపరింటెండెంట్‌

మల్లారెడ్డి ఇల్లు

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డిని హైదరాబాద్‌కు తరలిస్తున్న ఏసీబీ అధికారులు

నిజామాబాద్‌ అర్బన్‌: ఆదాయానికి మంచి ఆస్తులను కూడబెడుతూ ‘పైసల మత్తు’లో ఉన్న ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ప్రగతినగర్‌లో ఉన్న ఆయన ఇంట్లో, ఎకై ్సజ్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆ యన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ప్రగతినగర్‌లోని ఇంట్లో రూ.3.31 లక్షలు, బ్యాంకులో రూ.50 లక్షలు జప్తు చేశారు. వివిధ ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు, ఒక కమర్షియ ల్‌ భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసా య భూమిని గుర్తించారు. మూడు లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తులు, నగదు బయటపడే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నేడో రేపో వేరే జిల్లాకు వెళ్లిపోవాల్సిన ఎస్‌ఈని ఏసీబీ పట్టుకుంది. మూడున్నరేళ్లుగా జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న కొమ్మూరి మల్లారెడ్డి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. వైన్‌షాపులు, బార్‌లు, కల్లు డిపోలకు ఇవ్వాల్సిన మామూళ్లను ఫిక్స్‌ చేశారనే ఆరోపణలున్నాయి.

వారికే కాదు.. ఈయనకూ ‘గుడ్‌విల్‌’

నూతన వైన్‌షాపులు కేటాయించిన సమయంలో లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న వారు ‘గుడ్‌విల్‌’ తీసుకుని ఇతరులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఒక్కో షాపు నుంచి ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ రూ.2 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపుల నుంచీ కిందిస్థాయి సిబ్బంది ద్వారా నెలవారి మామూళ్లు అందేవి. వైన్స్‌షాపులు మద్యం విక్రయాల నిబంధనలను ఉల్లంఘించినా ఏనాడూ ఎస్‌ఈ తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. కోటాకు మించి విక్రయాలు సాగిస్తున్న వైన్‌షాపుల నుంచి నెలవారి మామూళ్లతో సంబంధం లేకుండా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అదనంగా వసూలు చేసేవారనే ఆరోపణలున్నాయి. అలాగే బార్‌లను రెండేళ్లుగా తనిఖీ చేయకపోవడానికి నెలవారీ మామూళ్లతోపాటు అదనపు వసూళ్లే కారణమని తెలుస్తోంది. కల్లు డిపోల నిర్వహణకు సంబంఽధించి ప్రతి సొసైటీ నుంచి రూ.25 వేల చొప్పున ఎస్‌ఈ నెలనెలా వసూలు చేశారని, ఇటీవల ఓ డిపో వ్యవహారంలో వివాదాలు తారాస్థాయికి చేరగా, విచారణ పేరుతో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.

నిందితులను వదిలేస్తూ..

జిల్లాలో భీమ్‌గల్‌, మోర్తాడ్‌, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ ఎకై ్సజ్‌ శాఖ స్టేషన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎస్‌హెచ్‌వోలు కొనసాగుతున్నా రు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు చేశా రు. అయితే జిల్లా అధికారులకు నెలవారి మామూళ్లు అందించడం, తప్పుచేసిన వారిని తప్పించేందుకు జిల్లా అధికారులకు భారీగా డబ్బులు సమర్పించడంలో కిందిస్థాయి సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కల్లు డిపోల్లో నిషేధిత మత్తుపదార్థాలు లభించినప్పడల్లా కేసు లు నమోదు చేయకుండా వదిలేసిన ఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో భారీ ఎత్తున డబ్బులు తీసుకొని నిందితులను వదిలేశారు. రెంజల్‌ మండలంలోని గత మూడు నెలల క్రితం చోటు చేసుకున్న ఘటన పరిస్థితికి అద్దం పడుతోంది.

మంగళవారం తెల్లవారు జామునే

చేరుకున్న అధికారులు

వైన్‌షాపులు, బార్‌లు,

కల్లు డిపోల నుంచి నెలవారీ మామూళ్లు

కిందిస్థాయి సిబ్బంది ద్వారా వసూళ్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement