నిజామాబాద్‌అర్బన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిని కాపాడడానికి సీపీఆర్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని సీపీ సాయి చైతన్య అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం సీపీ కార్యాలయంలో సీపీఆర్ పద్ధతిపై పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కానీ చాలామందికి ఈ పద్ధతిపై సరైన అవగాహన లేదని, దీంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఆర్ విధానం ప్రాథమిక ప్రథమ చికిత్స అత్యవసర పరిస్థితిలో ఎలా స్పందించాలి అనే అంశాలను నిపుణుల ద్వారా వైద్యుల ద్వారా పోలీస్ సిబ్బందికి తెలియజేశారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి , ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, డీఎంహెచ్‌వో రాజశ్రీ, వైద్యులు విశాల్, శ్రీశైలం, విఠల్ తదితరులు పాల్గొన్నారు


