తెయూ(డిచ్‌పల్లి): భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు అన్నారు. సమాజంలో విజయవంతంగా నిలవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘థింక్, స్పీక్, ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ అడ్వాన్స్‌డ్ ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యూ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ.. ఆంగ్ల భాషా నైపుణ్యం అవకాశాలకు ప్రధాన ద్వారం లాంటిందన్నారు. ప్రధాన వక్తగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ ఆంగ్ల విభాగం ప్రొఫెసర్ విజయ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం వినడం చదవడం మాత్రమే కాకుండా విశ్లేషనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వర్క్‌షాప్ కన్వీనర్ సమత, కోకన్వీనర్ రమణచారి, యూజీసీ కోఆర్డినేటర్ ఆంజనేయులు, కనకయ్య, ఘంటా చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణ చక్రవర్తి, జ్యోత్స్న, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు సూచించారు. తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘క్రీడోత్సవ్– 2026’లో భాగంగా మంగళవారం జరిగిన కబడ్డీ పోటీలను వీసీ ముఖ్యఅతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్మార్ట్ ఫోన్‌లను వీడి, ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏబీవీపీ ప్రతినిధులు పృథ్వీ, సమీర్, శివ, మనోజ్, అనిల్, మోహన్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.


