సరికొత్తగా క్యాంపస్‌.. | - | Sakshi
Sakshi News home page

సరికొత్తగా క్యాంపస్‌..

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

శరవేగంగా అభివృద్ధి పనులు

రెండు బాలికల, ఒక బాలుర హాస్టళ్ల నిర్మాణం

ఇండోర్‌, అవుట్‌ డోర్‌ కోర్టులు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత నెల 6వ తేదీన జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ పనులకు వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేసి న విషయం తెలిసిందే. రూసా, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గ్రాంట్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నిధులు, కొంత మొత్తం యూని వర్సిటీ ఇంటర్నల్‌ ఫండ్స్‌తో కలిపి మొత్తం రూ.91.6 కోట్ల తో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రూ.18.38 కోట్లతో కొత్తగా నిర్మించిన సైన్స్‌ కళాశాల భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రూ.8.6 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.1.36 కోట్లతో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు, రూ.26 లక్షలతో బాస్కెట్‌ బాల్‌ కోర్టు, కంప్యూటర్‌ సైన్స్‌ భవనంపై రూ.10 కోట్లతో పైఅంతస్తు, రూ.17 కోట్లతో ఆడిటోరియం, రూ.16 కోట్లతో నూతన పరిపాలన భవనం, ఒక్కోటి రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాల, బాలికల హాస్టళ్ల భవనా పనులు కొనసాగుతున్నాయి.

వచ్చే నెలలో అందుబాటులోకి..

యూనివర్సిటీ క్రీడా మైదానంలో రూ.1.36 కోట్లతో ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు, రూ.26 లక్షలతో బాస్కెట్‌బాల్‌ కోర్టు నిర్మాణ పనులు గత డిసెంబర్‌లో ప్రారంభమయ్యా యి. ఆధునిక సాంకేతికత వినియోగించి 5 షటిల్‌ కోర్టులతో ఇండోర్‌ స్టేడియం, ఒక బాస్కెట్‌బాల్‌ అవుట్‌డోర్‌ స్టేడియం నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో స్టేడియాలు అందు బాటులోకి వస్తాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

తీరనున్న బాలికల వసతి గృహ కష్టాలు

తెయూ క్యాంపస్‌లో ఇప్పటి వరకు కేవలం ఒకే బాలికల వసతి గృహం ఉండటంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గదులు సరిపోక ఒక్కో గదిలో 8 మంది వరకు ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం రూ.7కోట్ల రూసా నిధులతో చేపట్టిన నూతన బాలికల వసతి గృహ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న మరో బాలికల వసతి గృహంతోపాటు బాలల వసతి గృహ నిర్మాణ పనులు ఈ వారంలో ప్రారంభం కానున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఫుట్‌పాత్‌ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ భవనం పైఅంతస్తు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఆడిటోరియం, నూతన పరిపాలన భవన నిర్మాణ నమూ నా ఎంపిక పూర్తయి అంచనా దశలో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో ఈ భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి వర్సిటీ అధికారులు కృషి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement