వర్ని: విధులను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మండలంలోని కోటయ్య క్యాంపులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాల ని విద్యార్థినులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించొద్దని విద్యాలయ బాధ్యులను ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం తన వెంట తీసుకువచ్చిన డైరీలు, చాక్లెట్లను విద్యార్థులకు అందజేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్‌ను కేటాయిస్తానని అన్నారు.
అనంతరం నూతన భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సాయిలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరస్వతి ఉన్నారు.


