పాత కక్షలతో యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతో యువకుడి హత్య

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

పాత కక్షలతో యువకుడి హత్య

వేల్పూర్‌(మెండోరా): మెండోరా మండలం పోచంపాడ్‌ గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పోచంపాడ్‌ గ్రామానికి చెందిన వేము ల రిషిక్‌(20) అనే యువకుడు హైదరాబాద్‌లో చదువుకుంటుండగా, ఇటీవల హనుమాన్‌ జయంతికి సొంతూరుకు వచ్చాడు. రిషిక్‌ కుటుంబానికి, నర్సింహులు కుటుంబానికి డబ్బుల విషయంలో గతంలో గొడవలు జరిగాయి. ఈక్రమంలో సోమవారం గ్రామంలో ఒకరు చనిపోగా అంత్యక్రియల్లో పాల్గొని రిషిక్‌ ఇంటికి రాగా, మాట్లాడుకుందాం రా అని నర్సింహులు అతని కుమారుడు అతడిని తీసుకెళ్లారు. పాత కక్షల కారణంగా రిషిక్‌ను వారు కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చారు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స కోసం మొదట నిర్మల్‌ జిల్లాకు, ఆ తర్వాత నిజామాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి రిషిక్‌ మరణించినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. నిందితులు నర్సింహులు, అతని కుమారుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement