‘సురక్ష క్లినిక్‌’కు రాష్ట్రస్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘సురక్ష క్లినిక్‌’కు రాష్ట్రస్థాయి అవార్డు

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

సుభాష్‌నగర్‌: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఉన్న సురక్ష క్లినిక్‌ (సుఖ వ్యాధు ల చికిత్స కేంద్రం)కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభా రతిలో నిర్వహించిన కార్యక్రమంలో సురక్ష క్లినిక్‌ ప్రతినిధులు ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డు అందుకున్న వారిలో స్కిన్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ డాక్ట ర్‌ రామ్మోహన్‌, అదనపు జిల్లా వైద్యాధికారి (ఎయిడ్స్‌/లెప్రసి) డాక్టర్‌ దేవి నాగేశ్వరి, సురక్ష క్లినిక్‌ కౌన్సిలర్‌ వరలక్ష్మి ఉన్నారు.

15 నుంచి ఇంటిగ్రేటెడ్‌ పీజీ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ (ఐదు సంవత్సరాల కోర్సులు) పీజీ ఏపీఈ, ఐపీసీహెచ్‌ 8, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఈ నెల 15 నుంచి 24వరకు నిర్వహించబడతాయని కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్‌ సూచించారు.

ఆరోగ్యంపై శ్రద్ధ

వహించాలి

నిజామాబాద్‌అర్బన్‌: పోలీస్‌ సిబ్బంది తమ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య ది నోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరం ఏర్పా టు చేశారు. మేయర్‌ ఉమారాణి శిబిరాన్ని నగర ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడు తూ.. సిబ్బంది ఎల్లప్పుడు మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగకుండా ఉంటుందన్నారు. మన శరీరానికి ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఆ రోగ్యంపై అవగాహన పెంపొందించుకోవ డం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది ఆ రోగ్యాన్ని సంబంధిత డాక్టర్లతో చెక్‌ చేయించుకోవాలని, వారి సూచనలు సలహాలు తప్పనిసరి పాటించా లన్నారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ బస్వారెడ్డి, నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాష్‌, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్‌ కిషన్‌, జనరల్‌ సెక్రెటరీ అశోక్‌, నేషనల్‌ ఐఎంఏ యాక్షన్‌ కమిటీ చైర్మ న్‌ రవీందర్‌ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు విశాల్‌, మనోరమ సూపర్‌ స్పెషాలిటీ హాస్పి టల్‌ డాక్టర్‌ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్పొరేటర్‌పై కేసు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని 8వ డివిజన్‌ కార్పొరేటర్‌ మఠం పవన్‌ (బీజేపీ)పై ఐదో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బిల్డర్‌ గడ్డం ప్రసాద్‌ మున్సిపాలిటీ నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకుని అయోధ్యనగర్‌లో వందగజాల స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నాడు. అయితే కార్పొరేటర్‌ పవన్‌ తన అనుచరుడు వినోద్‌ను పంపించి ప్రసాద్‌ వద్ద డబ్బులు డిమాండ్‌ చేశాడు. ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు ఐదో టౌన్‌ పోలీసులు పవన్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement